బుల్లితెర మీద అప్పుడప్పుడు కనిపించే చక్కని తెలుగమ్మాయి తేజస్వి మడివాడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే ఆహా ఓటిటి మీద కాకమ్మ కథలు పేరుతో ఒక షోకి హోస్ట్ గా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది.
ఇటీవల "అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో బికినీ వేసుకుని కనిపించింది. ఇక ఒక షోలో బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చింది. "నా పేరు సగం నాశనం కావడానికి బిగ్ బాస్ సీజన్ 2 ఒక కారణం. నేను జర్నలిజం స్టూడెంట్ ని. ఒక ప్రోడక్ట్ ని అమ్మాలంటే ఎలాంటి ప్రోపగాండా చేస్తారో ఆ సీజన్ లో అలానే నా మీద ప్రోపగాండా చేశారు. నా మీద ఒక ప్లాన్ ప్రకారమే నెగటివ్ ప్రోపగాండా జరిగింది. దాన్ని తీసుకోవడం నాకు కష్టంగా అనిపించింది. బిగ్ బాస్ 2 కి వెళ్ళినప్పుడు నా వయసు 25 . ఆ సీజన్ నన్ను చాలా బాడ్ చేసింది. జనాల్లోకి ఒక ఇమేజ్ వచ్చేసాక అది మార్చడం చాలా చాలా కష్టం. కాబట్టి ప్రజల ఆలోచనను నేను మార్చలేను. నేను ఎలా ఉండాలి అనుకుంటానో అలాగే ఉంటాను. నేను ఏ బిగ్ బాస్ సీజన్ కూడా చూడను. డబ్బులు తీసుకుని చెక్కేసే టైపు. బిగ్ బాస్ కి ఒకసారి వెళ్లి వచ్చాక సిగ్గున్నోడు ఎవడైనా మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్తాడా. నేను వెళ్లాను బిగ్ బాస్ ఓటిటికి వెళ్ళా డబ్బులు. చూడడానికి రిచ్ కిడ్ కనిపిస్తా కానీ నాకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి బుల్లితెర మీద ఎక్కువగా నేను కనిపించడానికి కారణం కేవలం డబ్బుల కోసమే.. " అంటూ చెప్పుకొచ్చింది.